Viral Video: పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిందో వింత వాహనం.. నివ్వెరపోయి చూస్తున్న జనం.. పడుకునే మంచాన్నే బైకుగా మార్చేశారుగా..!
ABN , First Publish Date - 2023-06-09T21:08:33+05:30 IST
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుంటారు. మూలనపడ్డ కూలర్లు, మట్టి కుండలను వినియోగించి.. మినీ ఏసీ యంత్రాన్ని తయారు చేసేవారు కొందరైతే.. మరికొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చి వినియోగంలోకి తెస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి..
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తుంటారు. మూలనపడ్డ కూలర్లు, మట్టి కుండలను వినియోగించి.. మినీ ఏసీ యంత్రాన్ని తయారు చేసేవారు కొందరైతే.. మరికొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చి వినియోగంలోకి తెస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిన ఓ వింత వాహనాన్ని చూసి జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పడుకునే మంచాన్నే వాహనంగా మార్చేశాడు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో వినూత్న వాహనానికి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి ఎవరికీ రాని ఆలోచన వచ్చింది. పడుకున్న మంచంపైనే వీధుల్లో విహరిస్తే ఎలా ఉంటుంది.. అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంచానికి (cot converted into vehicle) నాలుగు వైపులా నాలుగు చక్రాలను అమర్చాడు. వెనుక వైపు డీజిల్ నడిచేలా ఓ ఇంజిన్ను (Engine) ఏర్పాటు చేశాడు. మంచానికి ఓవైపు చివరన స్టీరింగ్ అమర్చాడు. తద్వారా ముందు చక్రాలను కంట్రోల్ చేస్తూ.. ఎంచక్కా రోడ్లపై దూసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ డీజిల్ (Diesel) కొట్టించుకోవడానికి ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు.
ఈ వింత వాహనాన్ని (strange vehicle) చూసిన వారంతా నివ్వెరపోయారు. అరె! ఇదేదో భలే ఉందే.. అనుకుంటూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వాహనం గంటకు సగటున 50 నుంచి 60 కిలీమీటర్ల వేగాన్ని ఇస్తుందని, ఇందులో సుమారు 5మంది ప్రయాణించవచ్చని సదరు వ్యక్తి తెలిపాడు. డీజిల్ పట్టించుకున్న తర్వాత బంక్ చుట్టూ ఓ రౌండ్ వేసిన వ్యక్తి.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వారెవ్వా! ఏం ఐడియా గురూ..’’ అని కొందరు, ‘‘ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు.. ఒక్క భారతీయులకే సాధ్యం’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.