Airplane: విమానంలో ఓ వ్యక్తి చేసిన తింగరి పనికి భయంతో వణికిపోయిన ప్రయాణీకులు.. ఎందుకిలా చేశావని పోలీసులు నిలదీస్తే..!
ABN , First Publish Date - 2023-06-02T15:41:13+05:30 IST
కొందరు కనీస అవగాహన కూడా లేకుండా చేసే పనులు.. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరి కొందరు బస్సు, రైలు, విమానాల్లో తింగరి పనులు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ..
కొందరు కనీస అవగాహన కూడా లేకుండా చేసే పనులు.. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరి కొందరు బస్సు, రైలు, విమానాల్లో తింగరి పనులు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. విమానంలో ఓ వ్యక్తి చేసిన తింగరి పనికి ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. ఎందుకిలా చేశావని పోలీసులు అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం విని అంతా అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దక్షిణ కొరియాలో (South Korea) గత శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏషియానా ఎయిర్‌లైన్స్ (ASIANA AIRLINES) విమానం.. సియోల్‌కు ఆగ్నేయంగా ఉన్న డేగు అంతర్జాతీయ విమానాశ్రయానికి 240 కిలోమీటర్ల దూరంలో సుమారు 650 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. కొద్ది సేపట్లో విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుందనగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి కుర్చీ నుంచి పైకి ఎమర్జెన్సీ డోరు వద్దకు వెళ్లాడు. ఏం చేస్తున్నాడని అంతా ఆలోచించేలోపే అందరికీ షాక్ ఇచ్చాడు. ఎమర్జెన్సీ డోరును తెరవడంతో (man opened the emergency door) ఒక్కసారిగా అంతా భయంతో వణికిపోయారు. తలుపు తెరవగానే అత్యధిక వేగంతో లోపలికి వచ్చిన గాలి దాటికి ప్రయాణికులంతా (passengers) తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Bride: వామ్మో.. ఈ పాము పెద్ద కథే నడిపిందిగా.. ఈ వధువు వద్దకు వరుడిని ఎలా రప్పించిందో మీరే చూడండి..!
విమానం ఎక్కడ కూలిపోతుందో అనే భయంతో ఒక్కసారిగా అంతా కేకలు పెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా హమ్మయ్య!.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఎమర్జెన్సీ తలుపును తెరచిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు ఇలాంటి పని చేశావని అడగ్గా.. ‘‘నాకు ఊపిరి ఆడలేదు.. గాలి కోసమని డోరు తెరిచా’’.. అని అతను చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది, 194 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో సుమారు 9మంది అస్వస్తతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.