Viral Video: వామ్మో.. ఈ పరాటాను తినాలంటే మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచిస్తారేమో.. దీన్ని అసలు ఎలా చేశారో చూస్తే..!
ABN , First Publish Date - 2023-05-02T18:47:04+05:30 IST
వినూత్న వంటకాలను రుచి చూసేందుకు భోజన ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. వీరి అభిరుచికి తగట్టుగా చాలా మంది వ్యాపారాలు వివిధ రకాల వంటకాలను సిద్ధం చేస్తుంటారు. కొందరు ఓ అడుగు ముందు కేసి.. చిత్రవిచిత్రమైన రెసిపీలతో..
వినూత్న వంటకాలను రుచి చూసేందుకు భోజన ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. వీరి అభిరుచికి తగట్టుగా చాలా మంది వ్యాపారాలు వివిధ రకాల వంటకాలను సిద్ధం చేస్తుంటారు. కొందరు ఓ అడుగు ముందు కేసి.. చిత్రవిచిత్రమైన రెసిపీలతో కొత్త రకం వంటకాలను తయారు చేస్తుంటారు. కొందరు తయారు చేసే వంటనలను చూస్తే.. వెంటనే వెళ్లి తినాలనిపిస్తుంటుంది. ఇలాంటి నోరూరించే వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పరాటాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ పరాటాను తినాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలేమో’’... అని నెటిజన్లు అంటున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. ఓ వ్యక్తి పరాటాను చేసే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా భోజనంలో నెయ్యిని (ghee) మితంగా వేసుకుని తింటూ ఉంటాం. కానీ ఓ వ్యక్తి వింత ఐడియా వచ్చింది. ఏకంగా నెయ్యిలోనే పరాటాను (paratha cooked in ghee) ఉడికిస్తే ఎలా ఉంటుందీ.. అని అనుకున్నాడు. ఇందుకోసం ముందుగా ఓ మందపాటి పరాటాను సిద్ధం చేసుకున్నాడు. తర్వాత పైనంపై అధిక మోతాదులో నెయ్యి వేసి, దానిపై పరాటాను వేస్తాడు.
పరాటాను అటూ ఇటూ కాల్చుతూ మధ్యలో మరింత నెయ్యిని పోస్తాడు. నూనేలో పూరీని వేయించినట్లుగా.. ఇతను నెయ్యిలో పరాటాను వేయిస్తాడు. తర్వాత మిగిలిన నెయ్యిని పక్కన ఉన్నె పాత్రలో పోస్తాడు. చివరకు పరాటాను గట్టిగా అదిమిపట్టి.. పీస్‌లుగా కట్ చేసి ప్లేట్‌లో వడ్డిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదెక్కడి పరాటారా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘నెయ్యిని ధారాలంగా వాడుతున్న ఇతడి తెగింపును మెచ్చుకోవచ్చు’’.. అంటూ మరికొందరు, ‘‘ఖచ్చితంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.