Viral news: బంధువులంతా ఎదురు చూస్తుంటే.. ఎవరికీ తెలియదులే అనుకుంటూ.. వివాహానికి కాస్త ముందు వధువు చేసిన పనితో.. చివరకు..
ABN , First Publish Date - 2023-05-02T15:49:53+05:30 IST
వివాహాల సమయంలో హాస్యాస్పద ఘటనలతో పాటూ కొన్నిసార్లు ఊహించని విధంగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వధూవరులను ఆట పట్టించే క్రమంలో స్నేహితులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే..
వివాహాల సమయంలో హాస్యాస్పద ఘటనలతో పాటూ కొన్నిసార్లు ఊహించని విధంగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వధూవరులను ఆట పట్టించే క్రమంలో స్నేహితులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వరుడిని వధువు, వధువును వరుడు ఫూల్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు ఊహించని ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాహ వేదిక వద్ద వరుడితో పాటూ బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా వధువు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో వధువు చేసిన పని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌గా (Viral news) మారింది. ఘనాలోని (Ghana) కసోవాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం (marriage) నిశ్చయమైంది. వివాహం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా వివాహ వేదిక ప్రాంతానికి చేరుకున్నారు. వరుడు సాంప్రదాయ వస్త్రధారణలో సిద్ధంగా ఉన్నాడు. అయితే వధువు (bride) మాత్రం ఎంతకీ అక్కడికి చేరుకోలేదు. ఎవరికీ తెలియదులే అనుకుని పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి తన ప్రియుడిని కలిసింది. ఆమె కోసం అంతా కంగారుగా ఎదురు చూస్తున్నారు.
ప్రియుడితో చాలా సేపు మాట్లాడిన (Bride meets her boyfriend) అనంతరం ఆమె వేదిక వద్దకు చేరుకుంది. చివరకు ఈ విషయం తెలుసుకున్న వరుడు తీవ్ర ఆగ్రహానికి (angry groom) గురయ్యాడు. ‘‘ఈ పెళ్లి నా కొద్దు’’.. అంటూ కళ్యాణ మండపం నుంచి బయటికి వచ్చాడు. దీంతో వధువు తరపు బంధువులంతా అతన్ని బ్రతిమాలుకున్నారు. ‘‘దయచేసి ఈ పెళ్లి రద్దు చేసుకోవద్దు’’.. అంటూ వేడుకున్నా వరుడు శాంతించలేదు. చివరకు వధువు కూడా వరుడిని ఎంతో వేడుకుంది. అయినప్పటికీ శాంతించని వరుడు.. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో వధువు రోడ్డుపై పడి బోరున విలపిస్తుంది. పక్కన ఉన్న స్నేహితులు ఆమెను ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.