Viral Video: మంచిదంటూ.. మట్టి కుండలో నెయ్యి వేసి పోపు పెడుతున్నారా.. అయితే ఇలాంటి తప్పు మాత్రం చేయకండి..
ABN , First Publish Date - 2023-09-10T21:17:32+05:30 IST
వంట చేయడం అనేది ఓ కళ.. తెలిస్తే సులభమే కానీ.. తెలియకపోతే మాత్రం అసలుకే ఎసరు వస్తుంది. తప్పని సరి పరిస్థితుల్లో కొందరు, ఓ సారి ట్రైచేస్తే పోలా.. అనుకుంటూ మరికొందరు చేతిలో గరిట పట్టుకుని పాకశాస్త్ర నిపుణుల్లా బిల్డప్ ఇస్తూ వంట చేసేస్తుంటారు. తీరా ఏదో చేయాలని చూస్తే.. చివరికి..
వంట చేయడం అనేది ఓ కళ.. తెలిస్తే సులభమే కానీ.. తెలియకపోతే మాత్రం అసలుకే ఎసరు వస్తుంది. తప్పని సరి పరిస్థితుల్లో కొందరు, ఓ సారి ట్రైచేస్తే పోలా.. అనుకుంటూ మరికొందరు చేతిలో గరిట పట్టుకుని పాకశాస్త్ర నిపుణుల్లా బిల్డప్ ఇస్తూ వంట చేసేస్తుంటారు. తీరా ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అవుతుంటుంది. కొన్నిసార్లు ఇది ప్రమాదానికీ దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) వెరైటీగా ట్రై చేయాలని ఓ మట్టి కుండ తీసుకుని ప్రయోగం చేస్తుంది. ముందుగా స్టవ్ వేడి చేసుకుని దానిపై మట్టి (clay pot) కుండను పెడుతుంది. తర్వాత అందులో నెయ్యి (ghee) వేసి వేడి చేస్తుంది. అనంతరం అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మరింత వేడి చేస్తుంది. అయితే ఈ సమయంలో ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అప్పటికే బాగా హీటెక్కిన మట్టి కుండ (Exploded clay pot) ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలిపోయింది.
పేలుడు దాటికి కుండ కింది భాగం పూర్తిగా పేలిపోయి.. మట్టి పెంకులు ఎగిరి పక్కన పడిపోతాయి. అయితే పేలుడు తక్కువ పరిమాణంలో జరగడంతో అక్కడున్న వారికి ఎలాంటి ప్రమాదమూ కాలేదు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అనుభవం లేకుండా వంట చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఇదేంటీ ఇలా జరిగింది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.