ఒకప్పుడు ఏసీ మెకానిక్‌గా అరకొర జీతం.. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదన.. ఫ్రెండ్ చెప్పిన ఒక్క సలహాతో ఈ కుర్రాడి లైఫే మారిపోయింది..!

ABN , First Publish Date - 2023-03-18T21:34:00+05:30 IST

ప్రతి ఒక్కరిలో ఓ టాలెంట్ ఉంటుంది. కొందరు దాన్ని గుర్తించక.. జీవితంలో రాజీపడి కాలం వెళ్లదీస్తుంటారు. మరికొందరు వారి టాలెంట్‌కు పదును పెట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కూడా..

ఒకప్పుడు ఏసీ మెకానిక్‌గా అరకొర జీతం.. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదన.. ఫ్రెండ్ చెప్పిన ఒక్క సలహాతో ఈ కుర్రాడి లైఫే మారిపోయింది..!

ప్రతి ఒక్కరిలో ఓ టాలెంట్ ఉంటుంది. కొందరు దాన్ని గుర్తించక.. జీవితంలో రాజీపడి కాలం వెళ్లదీస్తుంటారు. మరికొందరు వారి టాలెంట్‌కు పదును పెట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కూడా ఈ కోవకే చెందుతాడు. ఒకప్పుడు అతను ఏసీ మెకానిక్‌గా పని చేసేవాడు. అరకొర జీతంతో బతికే అతను ప్రస్తుతం నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఫ్రెండ్ చెప్పిన ఒక్క సలహాతో ఈ కుర్రాడి లైఫే మారిపోయింది. ఇతడి విజయ రహస్యానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్‌కు చెందిన నిజాముల్ ఖాన్ అనే యువకుడు.. సాధారణ మధ్య తరగతి కుటంబానికి చెందినవాడు. వీరి ఆర్థిక పరిస్థితి (Financial situation) అంతంతమాత్రమే కావడంతో జీవనోపాధి కోసం ఇతను ఏసీ రిపేర్ వర్క్ (AC repair work) నేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఇంటింటికీ వెళ్లి ఏసీలు రిపేరు చేస్తూ ఉండేవాడు. అయితే జీతం అరకొరగా ఉండడంతో ఎటూ సరిపోయేది కాదు. దీంతో చాలా ఇబ్బందులు పడేవాడు. అయినా తప్పదు కాబట్టి.. అలాగే చేస్తూ ఉండేవాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. చిన్న తనంలో తన సైకిల్ మీద వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ఉండేవాడు. పెద్దయ్యాక బైకుపై కూడా అనేక విన్యాసాలు (Bike stunts) చేస్తూ ఉండేవాడు.

ప్రియురాలి ఛాతిపై తన పేరును రాసి మరీ కండీషన్ పెట్టాడు.. కొన్నాళ్ల తర్వాత బాలిక తండ్రి తన సూట్ కేస్ తెరవడంతో..

byke-viral-videos.jpg

ఈ క్రమంలో నిమాముల్ స్నేహితుడు ఓ సలహా ఇచ్చాడు. య్యూటూబ్ చానల్ (YouTube channel) ప్రారంభించి, బైకుపై చేసే విన్యాసాలను అందులో అప్‌లోడ్ చెయ్.. అని చెప్పాడు. దీంతో, ఇదేదో బాగుందే అనుకున్న నిజాముల్.. వెంటనే చానల్ స్టార్ట్ చేసి, వీడియోలు పెడుతూ ఉండేవాడు. అయితే మొదట్లో 200, 400 వ్యూస్ మాత్రమే వచ్చేవి. దీంతో మొదట్లో చాలా నిరాశకు గురయ్యే వాడు. అయినా అలాగే వీడియోలు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమలో ఓ వీడియోకు సుమారు 80వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అప్పటి నుంచి సబ్‌స్రైబర్లు (Subscribers) ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడ్డారు.

Viral Video: ఈఎమ్ఐ చెల్లించలేదని రైతుపై బ్యాంకు అధికారుల ఫైర్.. బైక్‌పై ఎక్కించుకుని మరీ బైక్‌ను ఎత్తుకెళ్లిన నెట్టింట ఫన్నీ సెటైర్లు..!

youtube-trending-news.jpg

అప్పటి నుంచి నిజాముల్ ఖాన్‌కు వెనక్కు తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. ఒకప్పుడు వేలల్లో సంపాదించే నిజాముల్.. ప్రస్తుతం నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. బైకుపై వివిధ రకాల స్టంట్స్ చేయడంతో పాటూ సందేశాన్ని ఇచ్చే వీడియోలు కూడా చేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు. ప్రస్తుతం నిమాముల్ య్యూటూబ్ చానల్‌కు ఒక మిలియన్‌కి పైగా సబ్‌స్రైబర్లు ఉన్నారు. ఎడిటింగ్, స్కిప్ట్ (Video editing) తదితర పనుల కోసం సిబ్బందిని నియమించుకుని, వారికీ ఉపాధి కల్పిస్తున్నాడు. ప్రస్తుతం నిజాముల్ ఖాన్.. స్థానిక యువకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Viral Video: ఇంట్లో హ్యాపీగా డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లోంచి జూమ్ చేసి మరీ వీడియోను తీసి..

Updated Date - 2023-03-18T21:34:00+05:30 IST