ప్రియురాలి ఛాతిపై తన పేరును రాసి మరీ కండీషన్ పెట్టాడు.. కొన్నాళ్ల తర్వాత బాలిక తండ్రి తన సూట్ కేస్ తెరవడంతో..
ABN , First Publish Date - 2023-03-18T17:21:29+05:30 IST
చదువుకునే వయసులో కొందరు యువతీయువకులు.. ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. యువకులు చెప్పే మాయమాటలను నమ్మి చాలా మంది బాలికలు మోసపోవడం రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. తాజాగా..
చదువుకునే వయసులో కొందరు యువతీయువకులు.. ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. యువకులు చెప్పే మాయమాటలను నమ్మి చాలా మంది బాలికలు మోసపోవడం రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. తాజాగా, యూపీలో ఓ బాలిక విషయంలో ఇలాగే జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలి ఛాతిపై బ్లేడుతో తన పేరును రాసి మరీ కండీషన్ పెట్టాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత బాలిక తండ్రి తన సూట్ కేస్ తెరచి చూసి షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
యూపీలోని (Uttar Pradesh) కాన్పూర్ గ్వాల్టోలీ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈమెకు ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన అమన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. రోజూ చనువుగా మాట్లడుతూ బాలికకు బాగా దగ్గరయ్యాడు. మంచి మాటలు చెబుతుండడంతో ఆమె కూడా త్వరగా అతన్ని నమ్మేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. అప్పటి నుంచి సదరు బాలిక.. ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడూ యువకుడిని కలుస్తూ ఉండేది. అయితే ఇటీవల ఓ రోజు ప్రియురాలిని (girlfriend) నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన అమన్.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా ఆ ఘటనను వీడియో (Video) తీయడమే కాకుండా.. బ్లేడుతో ఆమె ఛాతిపై తన పేరును పచ్చబొట్టులా రాశాడు. తనకు డబ్బులు అవసరం ఉన్నాయని, ఎలాగైనా ఇంట్లో వాళ్లకు తెలీకుండా డబ్బులు తేవాలంటూ కండీషన్ పెట్టాడు. డబ్బులు తేకుంటే వీడియోలను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక భయాందోళనకు గురై.. విధిలేని పరిస్థితిలో అతడు చెప్పిన కండీషన్‌కు ఒప్పుకొంది. తండ్రి తన అక్క పెళ్లి కోసం ఇంట్లో దాచిన రూ.10లక్షల రూపాయలను విడతల వారీగా.. ప్రియుడికి ఇస్తూ వచ్చింది.
ఇలా చివరకు సూట్ కేస్‌లో ఉన్న డబ్బులు మొత్తం ప్రియుడికే (boyfriend) ఇచ్చేసింది. ఇటీవల ఓ రోజు సూట్ కేస్ తెరచి చూసిన బాలిక తండ్రి.. అందులో డబ్బులు లేకపోవడం చూసి షాక్ అయ్యాడు. చిన్న కూతురిపై అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. విషయం మొత్తం చెప్పేసింది. దీంతో బాలిక తండ్రి చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న అమన్, అతడి సహచరుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.