Viral Video: అరె! మెట్రోలో టికెట్ లేకుండా ఇలాక్కూడా వెళ్లొచ్చా.. ఈ యూట్యూబర్ ఎలాంటి ప్లాన్ వేశాడో చూడండి..
ABN , First Publish Date - 2023-09-24T20:53:25+05:30 IST
రైళ్లలో నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వీరిలో చాలా మంది టికెట్ లేకుండానే రైలు ఎక్కుతుంటారు. కొన్నిసార్లు టీసీ పట్టుకుని మధ్యలోనే దింపేస్తుంటాడు. మరికొన్నిసార్లు జరిమానాలు కూడా విధిస్తుంటారు. అయినా కొందరు అలాగే ప్రయాణం చేస్తుంటారు. అయితే...
రైళ్లలో నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వీరిలో చాలా మంది టికెట్ లేకుండానే రైలు ఎక్కుతుంటారు. కొన్నిసార్లు టీసీ పట్టుకుని మధ్యలోనే దింపేస్తుంటాడు. మరికొన్నిసార్లు జరిమానాలు కూడా విధిస్తుంటారు. అయినా కొందరు అలాగే ప్రయాణం చేస్తుంటారు. అయితే మెట్రో రైల్లో కూడా ఇలాగే చేస్తామంటూ కుదరదు. ఖచ్చితంగా టికెట్ తీసుకుంటేనే రైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్‌లో సెక్యూరిటీ వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఓ యూట్యూబర్ టికెట్ లేకుండానే మెట్రో రైల్లో ప్రయాణించాడు. అంతటితో ఆగకుండా ఇలా వెళ్లాలి అంటూ వీడియో కూడా తీసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ యూట్యూబర్‌కు సంబంధించిన వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ విదేశీ యూట్యూబర్ బెంగళూరులో (Bangalore) చిత్రమైన సాహసం చేశాడు. మెట్రో రైల్లో (metro train) ఫ్రీగా ప్రయాణిస్తానంటూ చాలెంజ్ చేసి మరీ వెళ్లాడు. మెట్రో స్టేషన్‌లోకి వెళ్లగానే అక్కడున్న ప్రయాణికులను కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అది సాధ్యం కాదు అని వారు అనడంతో.. నేను చేసి చూపిస్తానంటూ లోపలికి వెళ్లిపోతాడు. సాధారణంగా స్టేషన్ నుంచి ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లాలంటే మధ్యలో సెక్యూరిటీ గేటు వద్ద కాయిన్స్, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ యూట్యూబర్ (YouTuber) మాత్రం సెక్యూరిటీ గేటు వద్దకు వెళ్లగానే.. ఎవరూ లేని సమయంలో చూసి గేటును జంప్ చేసి అవతలికి వెళ్లిపోతాడు. తర్వాత నేరుగా ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లి రైలు కూడా ఎక్కేస్తాడు. బోగీలో ప్రయాణికుల ముందు ఎక్సర్‌సైజులు కూడా చేస్తాడు. తర్వాతి స్టేషన్‌లో దిగిపోయిన తర్వాత.. స్టేషన్ నుంచి బయటికి వెళ్లే క్రమంలో కూడా సెక్యూరిటీ గేటును అలాగే జంప్ చేసి వెళ్లిపోతాడు. ‘‘చూశారా.. టికెట్ లేకుండా ప్రయాణం చేసి చూపించా’’.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు.. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ వీడియోను బెంగళూరు పోలీసులు, మెట్రో అధికారులకు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘మీ కంటెంట్ బాగున్నా.. ఇలా చేయడం చాలా తప్పు’’.. అని కొందరు, ‘‘దేశ చట్టాలను గౌరవించని వారు ఇండియాకి రావద్దు’’.. అంటూ మరికొందరు, ‘‘అదే ఓ భారతీయుడు విదేశాల్లో ఇలా చేస్తే ఎలా ఉండేదో ఆలోచించండి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 58వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో! ఈ టీచర్ రూటే సపరేటు.. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ రూంలోనే..