Viral Video: చిప్స్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?
ABN , First Publish Date - 2023-09-23T18:38:51+05:30 IST
రోజులో ఏదో ఒక సమయంలో స్నాక్స్ తినని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందులోనూ చాలా మంది చిప్స్‌ను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిప్స్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని వివిధ కంపెనీలు వివిధ రకాల ప్లేవర్లతో తయారు చేసిన చిప్స్‌ను ఆకర్షణీయమైన ప్యాకెట్ల రూపంలో..
రోజులో ఏదో ఒక సమయంలో స్నాక్స్ తినని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందులోనూ చాలా మంది చిప్స్‌ను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిప్స్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని వివిధ కంపెనీలు వివిధ రకాల ప్లేవర్లతో తయారు చేసిన చిప్స్‌ను ఆకర్షణీయమైన ప్యాకెట్ల రూపంలో మార్కెట్లోకి సరఫరా చేస్తుంటాయి. అయితే చిప్స్ తినే వారిలో చాలా మందికి.. వాటిని ఫ్యాక్టరీల్లో ఎలా తయారు చేస్తారో తెలీదు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, బంగాళదుంపలతో చిప్స్ తయారు చేసే ప్రక్రియకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఫ్యాక్టరీలో బంగాళదుంపలతో చిప్స్ (chips Preparation) తయారు చేసే ప్రక్రియ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలోకి వెళితే.. పంట పొలాలోంచి తరలించిన బంగాళదుంప మూటలన్నీ (Potatoes) ఫ్యాక్టరీలో సిద్ధంగా ఉంటాయి. ఇద్దరు కార్మికులు ఓ మూటలను వరుసగా ఈడ్చుకొచ్చి యంత్రంలో పడేస్తుంటారు. అక్కడి నుంచి మరో యంత్రంలోకి వెళ్లిన బంగాళాదుంపలు.. ఆటోమేటిక్‌గా నీటిలో శుభ్రమవుతాయి.
Lions vs Buffalo: సింహాల గుంపు ఓ వైపు.. దున్నపోతుల గుంపు మరో వైపు.. అడవిలో బిగ్ ఫైటింగ్.. చివరకు..!
తర్వాత ఇంకో యంత్రంలోకి గిరాగిరా తిరగడం ద్వారా వాటిపై ఉన్న తొక్క మొత్తం ఊడిపోతుంది. అనంతరం వాటిని చిప్స్ ఆకారంలో కట్ చేసి సలసలా కాగుతున్న నూనెలో వేస్తారు. ఇలా చివరకు సిద్ధమైన చిప్స్ మొత్తం.. ట్రాలీలో ప్యాకింగ్ వద్దకు వెళ్తాయి. అక్కడున్న సిబ్బంది వాటిని ప్యాకెట్లలో నింపి తరలించేందుకు బాక్సులను సిద్ధ చేస్తారు. ఇలా కరకరలాడే నోరూరించే చిప్స్ దుకాణాలకు పయనమవుతాయన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషలో మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.