ODI World Cup 2023: ఖాతా తెరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. పసికూనపై భారీ గెలుపు
ABN , First Publish Date - 2023-10-10T20:24:28+05:30 IST
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఓపెనింగ్ దక్కింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీతో రాణించాడు. 59 బాల్స్‌లో 52 రన్స్ చేశాడు. అటు మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ మాత్రం సెంచరీతో చెలరేగాడు. 107 బాల్స్‌లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 140 రన్స్ చేశాడు. జో రూట్ కూడా అద్భుతంగా రాణించాడు. 68 బాల్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 రన్స్ చేశాడు. దీంతో ఒక దశలో ఇంగ్లండ్ 400 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. అయితే మిడిలార్డర్, లోయరార్డర్ తడబడింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 4, షొరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీయగా.. షకీబుల్ హసన్, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: World cup: టీమిండియాలో కీలక మార్పు.. శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్?
ఈ మ్యాచ్‌లో గెలవాలంటే బంగ్లాదేశ్ భారీ టార్గెట్‌ను ఛేదించాల్సి వచ్చింది. 365 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాను ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లే వణికించాడు. రెండో ఓవర్లోనే తంజిద్ హసన్ (1) అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. అదే ఓవర్లో నజీముల్ షాంటో (0)ను కూడా పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కెప్టెన్ షకీబుల్ (1), మెహిదీ హసన్ (8) కూడా వెంటనే అవుటయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ఓటమి ఖరారైంది. లిట్టన్ దాస్ (76), ముష్ఫీకర్ రహీమ్ (51) హాఫ్ సెంచరీలు చేసినా అప్పటికే కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ 4 వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన బౌలర్లు తలో వికెట్ సాధించారు.