Ashes Series: నైతిక విజయం ఇంగ్లండ్‌దే.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-08-01T16:27:50+05:30 IST

సొంత‌గ‌డ్డ‌పై గ‌త యాషెస్ సిరీస్ ద‌క్కించుకుని ఎన్నో అంచ‌నాల‌తో ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లోనూ తొలుత ఆధిప‌త్యం చెలాయించింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఆ జ‌ట్టు గెలిచి తిరుగులేని ముందంజ వేసింది. అయితే మూడో టెస్టులో విజయం సాధించి నాలుగో టెస్టులో గెలుపు అంచుల వరకు వచ్చిన ఇంగ్లండ్‌కు వరుణుడు విలన్‌గా మారాడు. కానీ త‌ప్ప‌క గెల‌వాల్సిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.

Ashes Series: నైతిక విజయం ఇంగ్లండ్‌దే.. ఎందుకంటే..?

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన యాషెస్ సిరీస్ క్రికెట్ అభిమానుల‌కు వినోదంతో పాటు థ్రిల్‌ను అందించింది. ముఖ్యంగా ఆఖ‌రి టెస్టు నాలుగో రోజు వ‌రుణుడు అడ్డుప‌డ‌టంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. అందులోనూ నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ ప‌డ‌కుండా 100కు పైగా ర‌న్స్ చేయ‌డంతో ఈ టెస్టు డ్రా అవుతుంద‌న్న అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే నాట‌కీయంగా ఐదో రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన‌ప్ కుప్ప‌కూల‌డంతో ఇంగ్లండ్ ఘ‌న‌విజ‌యం సాధించింది. త‌ద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో స‌మం చేసింది. అయితే యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పంచుకున్నా నైతిక విజ‌యం మాత్రం ఇంగ్లండ్‌దే అని క్రికెట్ విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.


సొంత‌గ‌డ్డ‌పై గ‌త యాషెస్ సిరీస్ ద‌క్కించుకుని ఎన్నో అంచ‌నాల‌తో ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లోనూ తొలుత ఆధిప‌త్యం చెలాయించింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఆ జ‌ట్టు గెలిచి తిరుగులేని ముందంజ వేసింది. బ‌జ్ బాల్ వ్యూహంతో ఇంగ్లండ్ తొలి టెస్టులో త‌ప్పిదాలు చేసినా ఆ జ‌ట్టు అదే వ్యూహాన్ని అమ‌లు చేసింది. రెండో టెస్టులో ఓడిపోయిన త‌ర్వాత స్టోక్స్ సేన‌పై విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అయినా మూడో టెస్టులోనూ దూకుడు మంత్రాన్నే ఇంగ్లీష్ జ‌ట్టు పాటించింది. దీంతో మూడో టెస్టులో విజ‌యం సాధించి సిరీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన ఆ టెస్టులో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 317 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఇంగ్లండ్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 592 ప‌రుగులు చేసి విజ‌యానికి బాట‌లు వేసుకుంది. కానీ చివ‌రి రెండు రోజులు వ‌రుణుడు అడ్డుప‌డ‌టంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయ‌లేక‌పోయింది. దీంతో సిరీస్ స‌మం చేసే అవ‌కాశాన్ని స్టోక్స్ సేన కోల్పోయింది.

ఇది కూడా చదవండి: India Second ODI: ప్రయోగాల బాటేనా..?

అయితే త‌ప్ప‌క గెల‌వాల్సిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ త‌డ‌బ‌డింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 283 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 295 ప‌రుగులు చేసి 12 ర‌న్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా దూకుడుగా ఆడి ఇంగ్లండ్ 395 ప‌రుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 384 ప‌రుగుల టార్గెట్ నిలిచింది. ఒక ద‌శ‌లో రెండో ఇన్నింగ్స్‌లో 140 ప‌రుగుల‌కు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆస్ట్రేలియా విజ‌యం వైపు దూసుకెళ్లింది. కానీ చివ‌రి రోజు ఇంగ్లండ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేసి ఆస్ట్రేలియాను 334 ప‌రుగుల‌కు పరిమితం చేశారు. దీంతో ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌ను స‌మం చేసి ఊపిరి పీల్చుకుంది. గెల‌వాల్సిన నాలుగో టెస్టును వ‌రుణుడు లాగేసుకోవ‌డంతో సిరీస్ సాధించే అవ‌కాశాన్ని ఇంగ్లండ్ చేజార్చుకుంది. దీంతో నైతికంగా సిరీస్ గెలిచింది ఇంగ్లండ్ జ‌ట్టేన‌ని క్రికెట్ విశ్లేష‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Updated Date - 2023-08-01T16:27:50+05:30 IST