World Cup: టీమిండియాపై పాకిస్థాన్ అక్కసు.. రోహిత్ శర్మ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ..
ABN , First Publish Date - 2023-11-16T15:51:23+05:30 IST
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలను చూసి ఓర్వలేకపోతున్న పాకిస్థానీలు విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు.
టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలను చూసి ఓర్వలేకపోతున్న పాకిస్థానీలు విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు. టాస్ సమయంలో హిట్‌మ్యాన్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాడంటూ ఆరోపించాడు. ఈ మేరకు ఓ పాకిస్థాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాస్ వేయడానికి ఐసీసీ అధికారులు కాయిన్ ఇచ్చిన ప్రతిసారి దానిని హిట్‌మ్యాన్ దూరంగా పడేలా వేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ టెయిల్స్ చెబితే హెడ్స్ అని, హెడ్స్ చెబితే టెయిల్స్ అని ఐసీసీ అధికారులు చెప్పారని ఆయన ఆరోపించాడు. రోహిత్ శర్మ కాయిన్ దూరంగా వేస్తుండడంతో ఇతర జట్ల కెప్టెన్లకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని అన్నాడు. కాయిన్‌ను దూరంగా వేయడమే ఫిక్సింగ్ కోసమని సికిందర్ భక్త్ చెబుతున్నాడు. ‘‘టాస్ సమయంలో రోహిత్ శర్మ నాణెం విసిరిన విధానం చాలా విచిత్రంగా ఉంది. చాలా దూరంగా ఇతర కెప్టెన్‌లు చూడటానికి వీల్లేకుండా వేస్తున్నాడు’’ అని సికిందర్ భక్త్ అంటున్నాడు.
ఐసీసీ అధికారులు ఎలాగూ తనకు అనుకూలంగానే ఉన్నారని, కాబట్టి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ క్రాస్ చెక్ చేయకుండా చూసుకుంటే సరిపోతుందని రోహిత్ ప్లాన్ వేశాడని ఆయన విమర్శలు చేశాడు. ఇందుకు సాక్ష్యంగా రోహిత్ శర్మ టాస్ సమయంలో ప్రతి సారి కాయిన్ దూరంగా వేసిన వీడియోలను కూడా చూపించాడు. అలాగే భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ వాంఖడే పిచ్‌ను చివరి నిమిషంలో టీమిండియాకు అనుకూలంగా మార్చిందని సికందర్ భక్త్ ఆరోపించాడు. అయితే పిచ్ మార్పు ఆరోపణలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. "పిచ్ మార్పు గురించి మాట్లాడే మూర్ఖులందరూ నోరు మూసుకుని ఉంటారు. పిచ్ మార్పు గురించి మాట్లాడటం మానేయండి. ఇది రెండు జట్లకు సంబంధించినది.’’ అని కౌంటరిచ్చారు. కాగా బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన టీమిండియా సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. భారీ స్కోర్లు నమైదన ఈ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో గెలిచింది.
.