Share News

India vs Pakistan Prediction: దాయాది పోరులో గెలుపెవరిదో చెప్పేసిన గూగుల్..!

ABN , First Publish Date - 2023-10-14T09:02:19+05:30 IST

వరల్డ్ కప్‌ 2023 (World Cup 2023) లో అసలైన దాయాది పోరుకు అంతా రెడీ అయింది. ఇంకొన్ని గంటల్లో భారత్, పాక్ తలపడబోతున్నాయి. ఈ ప్రపంచ కప్‌లోనే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

India vs Pakistan Prediction: దాయాది పోరులో గెలుపెవరిదో చెప్పేసిన గూగుల్..!

India vs Pakistan Prediction: వరల్డ్ కప్‌ 2023 (World Cup 2023) లో అసలైన దాయాది పోరుకు అంతా రెడీ అయింది. ఇంకొన్ని గంటల్లో భారత్, పాక్ తలపడబోతున్నాయి. ఈ ప్రపంచ కప్‌లోనే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో క్రికెట్‌ ఆడే దేశాలతో పాటు అభిమానులు ఈ దంగల్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్‌లలో ఇప్పటి వరకు ఇరు దేశాలు ఏడు సార్లు తలపడ్డాయి. ఈ ఏడు సార్లు కూడా టీమిండియానే పైచేయి సాధించింది. ఇప్పుడు ఎనిమిదో సారి దాయాదులు అమీతుమీకి సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ను ఈ సారి పోరులో విజయం ఎవరిని వరిస్తుందని ప్రశ్నిస్తూ భారీ స్థాయిలో సెర్చింగ్ మొదలెట్టారు. దీనికి సమాధానంగా గూగుల్ తన అంచనాను తెలియజేసింది. గూగుల్ ప్రీడిక్షన్ ప్రకారం భారత్‌కు విజయ అవకాశాలు ఏకంగా 68 శాతంగా ఉన్నాయి. పాకిస్థాన్‌కు మాత్రం జస్ట్ 32 శాతం మాత్రమే. ఇక ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ మనల్ని ఎవడ్రా ఆపేదంటూ హంగామా చేస్తున్నారు.

Team-India.jpg

ఇదిలాఉంటే.. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్, పాక్ చెరో రెండు మ్యాచులు ఆడి, రెండింటీలోనూ విజయాలు సాధించాయి. దాంతో చెరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో మాత్రం పాక్ కంటే భారత్ ఒక స్థానం మెరుగుగా ఉంది. దీనికి కారణం టీమిండియా నెట్ రన్ రేట్. ప్రస్తుతం రోహిత్ సేన మూడో స్థానంలో ఉంటే, పాక్ నాల్గో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి తమ రికార్డును పదిలంగా ఉంచుకోవాలని టీమిండియా చూస్తుంటే.. ఒక్కసారైనా వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను మట్టికరిపించాలని బాబర్ సేన భావిస్తోంది. ఇక బలబలాల విషయానికి వస్తే మాత్రం దాయాది జట్టు కంటే భారత జట్టునే మెరుగ్గా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో రోహిత్ సేన ముందుంది. అయితే, ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేని పాక్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టులో సైతం మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ, వరల్డ్ నం.01 బ్యాటర్, సారథి బాబర్ అజామ్ ఉన్నట్టుండి ఫామ్ కోల్పోవడం ఆ జట్టును కాస్తా కలవర పరుస్తుంది. జట్టుకు ప్రధాన బలమైన బాబర్ పరుగులు చేయలేకపోతున్నా కూడా శ్రీలంకపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి గెలవడం పాక్ ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు అదే ఊపులో టీమిండియాపై కూడా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.

WC India X Pak Match : హైఓల్టేజ్‌ ఫైట్‌ నేడే


Updated Date - 2023-10-14T09:13:03+05:30 IST