IND vs AFG: వారెవ్వా.. ఈ వరల్డ్ కప్‌లోనే బెస్ట్ క్యాచ్ అందుకున్న టీమిండియా ప్లేయర్

ABN , First Publish Date - 2023-10-11T16:38:29+05:30 IST

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ అదుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద శార్దూల్ అందుకున్న క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది.

IND vs AFG: వారెవ్వా.. ఈ వరల్డ్ కప్‌లోనే బెస్ట్ క్యాచ్ అందుకున్న టీమిండియా ప్లేయర్

ఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా భారత్, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్ అదుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద శార్దూల్ అందుకున్న క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది. శార్దూల్ ఠాకూర్ అద్భుత ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ సమయంలో హార్దిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్ నాలుగో బంతిని ఆ జట్టు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌ వైపు భారీ షాట్‌ ఆడాడు. అక్కడే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ ఆ బంతిని పక్కకు కదులుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే ఇంతలోనే నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్ దాటాడు. ఈ క్రమంలో తెలివిగా వ్యవహరించిన శార్దూల్ తాను బౌండరీ లైన్ దాటినప్పటికీ క్యాచ్‌ను మాత్రం వృథా కానివ్వలేదు. బౌండరీ లైన్ అవతలికి కాలు పెట్టే లోపు బంతిని గాల్లోకి ఎగిరేశాడు. ఆ వెంటనే మళ్లీ లోపలికి వచ్చి బంతి గాల్లో ఉండగానే క్యాచ్ అందుకున్నాడు.


దీంతో 21 పరుగులతో క్రీజులో కుదురుకున్న రహ్మానుల్లా గుర్బాజ్ ఔటయ్యాడు. 63 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ అద్భుత ఫీల్డింగ్‌కు తోటి ఆటగాళ్లతోపాటు మైదానంలోని ప్రేక్షకులు, టీవీలు, ఓటీటీల్లో మ్యాచ్‌ను వీక్షించేవారు ఫిదా అయిపోయారు. శార్దూల్ ఠాకూర్ అద్భుత ఫీల్డింగ్‌పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌తోనూ శార్దూల్ ఠాకూర్ ఆకట్టుకున్నాడు. 14వ ఓవర్లో 16 పరుగులు చేసిన రహమత్ షాను లెగ్‌ బైస్‌లో ఔట్ చేశాడు. దీంతో 63 పరుగులకే ఆప్ఘనిస్థాన్ 3 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 22 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ను జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ చేర్చాడు.

Updated Date - 2023-10-11T16:38:29+05:30 IST