Share News

World Cup Final: ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా తుది జట్టు ఇదే!

ABN , First Publish Date - 2023-11-19T13:43:21+05:30 IST

IND vs AUS Final: ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.

World Cup Final: ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. టీమిండియా తుది జట్టు ఇదే!

అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన కమిన్స్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌లు రెండు జట్లు కూడా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని టీమిండియా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభంలో వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 8 విజయాలతో ఫైనల్ చేరింది.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

కాగా వన్డే ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియా హెడ్ టూ హెడ్ వన్డే రికార్డుల విషయానికొస్తే ఇప్పటివరకు రెండు జట్లు 150 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత జట్టు 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డుల్లోనూ ఆసీస్‌దై పై చేయిగా ఉంది. రెండు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడితే.. అత్యధికంగా 5 ఆస్ట్రేలియా, మూడింటిలో టీమిండియా గెలిచింది. నాకౌట్ పోరులోనూ ఆసీస్‌దే పై చేయిగా ఉంది. నాకౌట్ పోరులో రెండు జట్లు మూడు సార్లు తలపడితే కంగారులు రెండు సార్లు, టీమిండియా ఒక సారి గెలిచింది. ఆస్ట్రేలియా 2003 ప్రపంచకప్ ఫైనల్, 2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలవగా.. భారత్ 2011 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక మోదీ స్టేడియంలో ఇప్పటివరకు 30 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 మ్యాచ్‌ల్లో, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 243గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 208గా ఉంది. ఈ పిచ్‌పై అత్యధిక స్కోర్ 365 కాగా.. అత్యల్ప స్కోర్ 85గా ఉంది. ఇక్కడ అత్యధిక చేధన 325 పరుగులుగా ఉంది. టాస్ గెలిచిన జట్లు 17 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. టాస్ ఓడిన జట్లు 13 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో చేజింగ్ చేసిన జట్లే మూడు గెలిచాయి. ఈ పిచ్‌లో స్పిన్నర్ల కన్నా పేసర్లకే ఎక్కువ వికెట్లు పడతాయని గత రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ పేస్ బౌలర్లు 246 వికెట్లు తీయగా.. స్పిన్ బౌలర్లు 135 వికెట్లు తీశారు.

Updated Date - 2023-11-19T13:48:22+05:30 IST