World Cup Final: అభిమానుల కోలాహలం, భారీ బందోబస్తు మధ్య స్టేడియానికి చేరుకున్న భారత జట్టు
ABN , First Publish Date - 2023-11-19T13:09:02+05:30 IST
IND vs AUS Final: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. తుది పోరులో ట్రోఫి కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ పోరు కోసం భారత క్రికెటర్లు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆటగాళ్లు స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత ఆటగాళ్లు వెళ్తున్న కాన్వాయ్‌కు అభిమానులు అడుగడునా బ్రహ్మరథం పట్టారు.
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. తుది పోరులో ట్రోఫి కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ పోరు కోసం భారత క్రికెటర్లు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆటగాళ్లు స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత ఆటగాళ్లు వెళ్తున్న కాన్వాయ్‌కు అభిమానులు అడుగడునా బ్రహ్మరథం పట్టారు. ఆటగాళ్ల బస్సు వెళ్లిన మార్గమంతా మువన్నెల జెండాలతో బ్లూమయంగా మారిపోయింది. ఆటగాళ్ల నినాదాలతో అహ్మదాబాద్ స్టేడియం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. లక్షకుపైగా అభిమానులు స్టేడియానికి తరలిరావడంతో ఏటు చూసిన జన సంద్రోహమే కనిపిస్తోంది. ఇసుక వేసిన రాలనంత స్థాయిలో టీమిండియా అభిమానులు కిక్కిరిసిపోయారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు కూడా స్టేడియానికి చేరుకున్నారు.
టీమిండియా కప్ గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఉదయం ఆలయాలలో పూజలు ప్రారంభించారు. టీమిండియా ప్రపంచకప్ గెలవాలని ఆంధ్రప్రదేశ్‌లోని అయ్యప్పస్వాములు పూజలు నిర్వహించారు. టీమిండియా క్రికెటర్ల ఫోటోతోపాటు దేవుళ్ల ఫోటోను పెట్టి పూజలు చేశారు. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియం వద్ద పండగ వాతావరణం నెలకొంది. లక్షకు పైగా అభిమానులు స్టేడియం వద్దకు వస్తుండడంతో ఆ ప్రాంతమంతా కేరింతలతో మార్మోగిపోతుంది. స్టేడియం పరిసరాలు మొత్తం బ్లూమయంగా మారిపోయాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నప్పటికీ ఉదయం నుంచే అభిమానులు స్టేడియానికి పొటెత్తారు.