Share News

IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. టీమిండియా యువ పేసర్ అరంగేట్రం

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:03 PM

Boxing Day Test: టీమిండియాతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మొదట బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌తో తమ జట్టు నుంచి నాండ్రే బర్గర్, డేవిడ్ బెడింగ్‌హామ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేంట్రం చేస్తున్నట్టు చెప్పాడు.

IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. టీమిండియా యువ పేసర్ అరంగేట్రం

సెంచూరియన్: టీమిండియాతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మొదట బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌తో తమ జట్టు నుంచి నాండ్రే బర్గర్, డేవిడ్ బెడింగ్‌హామ్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేంట్రం చేస్తున్నట్టు చెప్పాడు. ఈ మ్యాచ్‌లో తాము నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్న తెలిపాడు. టీమిండియాతో తలపడడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని, కానీ తాము అన్ని విధాలుగా సిద్దమైనట్టు బవుమా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నారు.


ఈ మ్యాచ్‌తో యువ పేసర్ ప్రసిద్ధ కృష్ణ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అతనికి టెస్ట్ క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు. అయితే ప్రస్తుతం స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. దీంతో అతని స్థానంతో మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నట్టు తెలిపాడు. కాగా వర్షం రావడంతో టాస్ అరగంట ఆలస్యంగా వేశారు.

తుది జట్లు

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్, ఐడెన్ మాక్రమ్, టోనీ డి జోర్జి, టెంబా బవుమా(కెప్టెన్), కీగన్ పీటర్‌సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

Updated Date - Dec 26 , 2023 | 02:07 PM