Share News

IPL 2024: మరికాసేపట్లో ఐపీఎల్ వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటే..?

ABN , Publish Date - Dec 19 , 2023 | 09:21 AM

IPL 2024 action: ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. తొలిసారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుండడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈ వేలాన్ని కూడా నిర్వహించనున్నారు.

IPL 2024: మరికాసేపట్లో ఐపీఎల్ వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటే..?

దుబాయ్: ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. తొలిసారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుండడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈ వేలాన్ని కూడా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభంకానున్న ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది స్వదేశీ, 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మొత్తంగా 8 కనీస ధరలతో ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇందులో గరిష్ఠ ధర రూ.2 కోట్లు. ఈ విభాగంలో 23 మంది క్రికెటర్లు ఉన్నారు. భారత్‌ నుంచి శార్దూల్‌ ఠాకూర్‌, హర్షల్‌ పటేల్‌, ఉమేశ్‌ యాదవ్‌ రూ.2 కోట్ల కేటగిరీలోనే ఉన్నారు. రూ.కోటి 50 లక్షల కేటగిరీలో 13 మంది ఉన్నారు. వేలం ద్వారా చూస్తుండగానే పలువురు అనామక ఆటగాళ్లు కోటీశ్వరులుగా మారిపోనున్నారు. విదేశీ ఆటాళ్లు రచీన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, కొట్జీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, హసరంగ, పాట్ కమిన్స్ ఈ వేలంలో భారీ ధర పలుకుతురానే అంచనాలున్నాయి. భారత ఆటగాళ్లు శార్దూల్‌, హర్షల్‌, షారుక్‌, చేతన్‌ సకారియాలకు కూడా భారీ ధర లభించే అవకాశాలున్నాయి.


ఈ నేపథ్యంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బుంది? ఆయా ఫ్రాంచైజీలు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. గతేడాది ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ వద్ద రూ.31.4 కోట్లున్నాయి. అయితే ఆ జట్టు మరో ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద రూ.17.75 కోట్లున్నాయి. మరో 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.28.95 కోట్లు మిగిలి ఉండగా.. మరో 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి వీలుంది. పంజాబ్ కింగ్స్ వద్ద రూ.29.1 కోట్లు ఉండగా.. మరో 8 మందిని కొనుగోలు చేయవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.34 కోట్లు మిగిలి ఉండగా మరో ఆరుగురిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.14.5 కోట్లు ఉండగా మరో 8 మందిని కొనుగులో చేయవచ్చు. అందరి కంటే తక్కువగా లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.13.15 కోట్లు ఉండగా.. మరో ఆరుగురిని కొనుగులు చేసేందుకు అవకాశం ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.23.25 కోట్లు ఉండగా మరో ఆరుగురిని కోనుగోలు చేయడానికి అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ వద్ద అందరి కంటే ఎక్కువగా రూ.38.15 కోట్లున్నాయి. మరో 8 మంది ఆటగాళ్లను కొనుక్కునేందుకు కూడా ఆ జట్టుకు అవకాశం ఉంది. చివరగా కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద రూ.32.7 కోట్లు మిగిలి ఉండగా.. ఆ జట్టు ఏకంగా 12 మందిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 19 , 2023 | 09:24 AM