Share News

Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌లో స్టేడియం స్టాఫ్ వర్కర్ కొడుకు ఆత్మహత్య

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:18 PM

దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌లో స్టేడియం స్టాఫ్ వర్కర్ కొడుకు ఆత్మహత్య

కోల్‌కతా: దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గ్రౌండ్ స్టాఫ్ వర్కర్ గణేష్ చంద్ర బారిక్ కుమారుడు ధనంజయ్ బారిక్(21)గా గుర్తించారు. ధనంజయ్ ఒడిషా నివాసి. స్టేడియంలోని కె-బ్లాక్‌లో మృతదేహం లభ్యమైంది. ఉదయం 8 గంటల సమయంలో మృతదేహం కనిపించిందని స్టేడియం సిబ్బంది కోల్‌కతా పోలీసులకు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఘటనపై స్థానిక మైదాన్ పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ఇవాళే నిర్వహించనున్నారు. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా స్టేడియంలోని సీసీటీవీ పుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 01:18 PM