Virat Kohli: ఐదేళ్ల తర్వాత ఓవర్సీస్‌లో సెంచరీ.. కోహ్లీ ఏమన్నాడో తెలుసా?
ABN , First Publish Date - 2023-07-23T13:09:19+05:30 IST
రికార్డులపై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజం చెప్పాలంటే ఈ రికార్డులు, సెంచరీలు ఎందుకు పనికి రావని అన్నాడు. రికార్డులు అనేవి మన గురించి బయటివారు మాట్లాడుకోవడానికి మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో తాను టెస్టుల్లో 15 సెంచరీలు చేశానని.. స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సెంచరీలు సాధించానని కోహ్లీ చెప్పాడు.
వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) రాణిస్తున్నాడు. తొలి టెస్టులో 76 పరుగులు చేసిన అతడు రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టాడు. 206 బాల్స్‌లో 11 ఫోర్లు సహాయంతో 121 రన్స్ చేశాడు. దీంతో టెస్టుల్లో 29వ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్ (Bradman) రికార్డును సమం చేశాడు. సుమారు ఐదేళ్ల తర్వాత టెస్టుల్లో కోహ్లీ చేసిన సెంచరీ ఇదే. 2018లో చివరిసారిగా ఆస్ట్రేలియా(Australia)లో శతకం బాదిన కోహ్లీ.. ఐదేళ్ల తర్వాత విదేశాల్లో (Overseas) సెంచరీ మార్క్ అందుకున్నాడు. విదేశాల్లో కోహ్లీకి ఇది 15వ సెంచరీ కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Viral Video: విరాట్ కోహ్లీ మీద అభిమానంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ తల్లి ఏం చేసిందో చూడండి!
మరోవైపు అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగానూ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో రికార్డులపై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజం చెప్పాలంటే ఈ రికార్డులు, సెంచరీలు ఎందుకు పనికి రావని అన్నాడు. రికార్డులు అనేవి మన గురించి బయటివారు మాట్లాడుకోవడానికి మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో తాను టెస్టుల్లో 15 సెంచరీలు చేశానని.. స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సెంచరీలు సాధించానని కోహ్లీ చెప్పాడు. ఇదేమీ చెత్త రికార్డు కాదని.. విదేశాల్లో మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడితే ఎక్కువ సెంచరీలు చేసివాడినేమోనని పేర్కొన్నాడు. గత ఐదేళ్లలో టీమిండియా విదేశాల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదని కోహ్లీ అన్నాడు. అయితే ఎన్ని మ్యాచ్‌లు ఆడామో సరిగ్గా తనకు తెలియదన్నాడు. విదేశాల్లో ఆడిన మ్యాచ్‌లలో తాను హాఫ్ సెంచరీలు కూడా చేశానని తెలిపాడు. మొత్తంగా ఎన్ని సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసినా ఆ రికార్డులు, ఘనతలు ఎందుకూ పనికి రావని కోహ్లీ స్పష్టం చేశాడు. అభిమానులకు గుర్తుండేది ఒక్కటేనని.. తమ ప్రదర్శన జట్టుకు విజయం అందించిందా లేదా అన్నదే ముఖ్యమన్నాడు.