World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం?
ABN , First Publish Date - 2023-10-25T11:03:13+05:30 IST
ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.
లక్నో: ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హార్దిక్‌ను ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉంచుతున్నట్టు సదరు అధికారి చెప్పారని సమాచారం. హార్దిక్ పాండ్యా దూరమైతే టీమిండియాకు పెద మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. మంచి పేస్ ఆల్ రౌండరైనా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అలాగే హార్దిక్ జట్టుకు దూరమైతే అతని స్థానంలో సరైన ప్రత్యామ్నాయం కూడా లేదు. దీంతో జట్టు సమతూల్యం దెబ్బతింటుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో టీమిండియా తుది జట్టులో ఏకంగా రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. కివీస్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌ను కూడా పక్కనపెట్టి సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైతే కివీస్‌తో మ్యాచ్‌లో చేసిన మార్పులు ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగనున్నాయి.
కాగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మూడో బంతికే హార్దిక్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ నేరుగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో హార్దిక్ కాలిని దూరంగా జరిపాడు. దీంతో బంతి అతని కాలికి బలంగా తాకింది. ఈ క్రమంలో హార్దిక్ చీలమండ భాగం మడత పడింది. దీంతో నొప్పితో విలవిలాడిన హార్దిక్ పాండ్యా వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే మొదట హార్దిక్ పాండ్యాకు అయిన గాయం పెద్దదేమి కాదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కానీ తాజాగా వరుసగా మ్యాచ్‌లకు దూరం అవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్‌లో భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 29న ఇంగ్లండ్‌తో ఆడనుంది.