India vs Pakistan: అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌కు అదిరిపోయే రికార్డు.. అదే జరిగితే..
ABN , First Publish Date - 2023-10-14T12:32:34+05:30 IST
మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంతో మ్యాచ్ క దీంతో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్ల గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే టీమిండియాకు సంపూర్ణ అధిపత్యం ఉంది.
అహ్మదాబాద్: మరికాసేపట్లో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంతో మ్యాచ్ క దీంతో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్ల గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే టీమిండియాకు సంపూర్ణ అధిపత్యం ఉంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడ్డాయి. అన్ని సార్లు టీమిండియానే గెలిచింది. ఈ సారి కూడా తమ రికార్డును కొనసాగించాలని భారత్.. తొలి విజయాన్ని నమోదు చేయాలని పాకిస్థాన్ పట్టుదలగా ఉన్నాయి. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మంచి రికార్డులే ఉన్నాయి. ఇక్కడ గతంలో 18 వన్డే మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10 గెలిచింది. అయితే ఈ స్టేడియంలో పాకిస్థాన్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఇక్కడ భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు ఒకే ఒక వన్డే మ్యాచ్ జరిగింది. చివరి వరకు తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఒక్క మ్యాచ్‌లో పాకిస్థానే గెలిచింది. అది కూడా భారీ లక్ష్యాన్ని చేధించి గెలవడం గమనార్హం. దీంతో పాకిస్థాన్‌కు ఇది సానుకూల దృకత్పతాన్ని కల్గించే అంశంగా చెప్పుకోవచ్చు. 2005వ సంవత్సరంలో రెండు జట్ల వన్డే సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే మ్యాచ్ ఇక్కడ జరిగింది. 48 ఓవర్లుగా జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సచిన్ టెండూల్కర్(123) సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యాన్ని పాకిస్థాన్ జట్టు చివరి బంతికి అందుకుని 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంజ్‌మామ్ ఉల్ హక్(60), షోయబ్ మాలిక్(65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఈ రికార్డు పాకిస్థాన్‌కు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం టీమిండియా బలంగా ఉంది. దీంతో గత రికార్డును చెరిపేసే అవకాశాలున్నాయి.
.
అహ్మదాబాద్ పిచ్ గత రికార్డులు
ఈ మైదానంలో ఇప్పటివరకు 29 వన్డే మ్యాచ్‌లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 16 సార్లు, చేజింగ్ చేసిన జట్టు 13 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 237గా ఉండగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోర్ 206గా ఉంది. ఇక్కడ అత్యధిక స్కోర్ 365గా(సౌతాఫ్రికా) ఉండగా.. అత్యల్ప స్కోర్ 85గా(జింబాబ్వే) ఉంది. అత్యధిక లక్ష్య చేధన 325గా(టీమిండియా) ఉండగా.. అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్నది 196గా(వెస్టిండీస్) ఉంది. మొత్తంగా ఇక్కడ ఒక మంచి మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి