World Cup: మరో 12 పరుగులు చేస్తే కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
ABN , First Publish Date - 2023-11-12T08:25:10+05:30 IST
Rohit Sharma: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇక లీగ్ దశలో భారత జట్టు తన చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇక లీగ్ దశలో భారత జట్టు తన చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్యా నెదర్లాండ్స్‌ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాకపోవచ్చు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డును అందుకునే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 12 పరుగులు చేస్తే కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో 14 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. దీంతో కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో 14 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. కాగా రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, టెస్టులు, ఐపీఎల్‌లో కలిపి 13,988 పరుగులు చేశాడు.
అలాగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరిన్ని రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మరో 4 ఫోర్లు కొడితే కెప్టెన్‌గా వన్డేల్లో 100 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు. మరో 108 పరుగులు చేస్తే కెప్టెన్‌గా వన్డేల్లో 2 వేల పరుగులను చేరుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్‌లో భారత్ ప్రత్యర్థి ఖరారు అయింది. సెమీస్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఈ నెల 15న ఈ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించి 2019 ప్రపంచకప్ సెమీస్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ స్టేడియం వేదికగా ఈ నెల 16న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.