IND vs AUS: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గేల్, గుప్తిల్ రికార్డులు బద్దలు!

ABN , First Publish Date - 2023-09-28T09:40:30+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర స‌‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ 6 సిక్సులు, 5 ఫోర్లతో 57 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డులను బద్దలు కొట్టాడు.

IND vs AUS: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గేల్, గుప్తిల్ రికార్డులు బద్దలు!

రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర స‌‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ 6 సిక్సులు, 5 ఫోర్లతో 57 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సుల ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 550 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర స‌ృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్ 548 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకోగా.. రోహిత్ 471 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సలు కొట్టిన రికార్డు గేల్ పేరు మీద ఉంది. గేల్ 553 సిక్సులు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 551 సిక్సులున్నాయి. దీంతో రోహిత్ మరో మూడు సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే స్వదేశంలో లేదా ఒక దేశంలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా కూడా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డును బ్రేక్ చేశాడు. గప్తిల్ 256 సిక్సులు కొట్టగా.. రోహిత్ 260 సిక్సులు కొట్టాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తయిన ఆస్ట్రేలియా.. ఆఖరి వన్డేలో జూలు విదిల్చింది. టాపార్డర్‌ బ్యాటర్లు చెలరేగిన వేళ భారత్‌తో బుధవారం జరిగిన చివరి వన్డేలో 66 పరుగులతో నెగ్గింది. ఈ ఓదార్పు విజయంతో వన్డే సిరీ్‌సలో వైట్‌వాష్‌ ప్రమాదంనుంచి ఆసీస్‌ తప్పించుకుంది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన కంగారూలు 50 ఓవర్లలో 352/7 భారీ స్కోరు సాధించారు. మార్ష్‌ (96), స్మిత్‌ (74), లబుషేన్‌ (72), వార్నర్‌ (56) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. బుమ్రా (3/81) మూడు, కుల్దీప్‌ (2/48) రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ (81), కోహ్లీ (56) హాఫ్‌ సెంచరీలు చేయగా శ్రేయాస్‌ (48) సత్తా చాటాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మ్యాక్స్‌వెల్‌ (4/40) నాలుగు వికెట్లు తీశాడు. గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. కాగా..సిరీస్‌ను భారత్‌ 2-1తో సొంతం చేసుకుంది.

Updated Date - 2023-09-28T09:40:30+05:30 IST