Home » Australia tour of India 2023
Suryakumar Yadav: ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు మాత్రమే అవసరం కాగా టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో ఏకంగా 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.
Glenn Maxwell: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 223 పరుగుల భారీ లక్ష్య చేధనలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. ఒకానొక దశలో 68/3తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్సీ తన అధ్బుత ఆటతో గెలుపుబాట పట్టించాడు.
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టేందుకు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 3 అడుగుల దూరంలో ఉన్నాడు. తన తర్వాతి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ మరొక 60 పరుగులు చేస్తే టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Tilak Varma: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోష్ ఇంగ్లీస్ ఈ సారి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.
Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.
2nd T20 Match Pitch Report: భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి టీ20 గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అధిక్యాన్ని మరింత పెంచుకోవాలని పట్టుదలగా ఉంది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో అధిక్యంలోకి వెళ్లిన టీమిండియా రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఈ మ్యాచ్‌లో మన జట్టు అన్ని విభాగాల్లో రాణించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.