ICC Rankings: ఆరు నెలలుగా ఆడకపోయినా చెదరని రిషబ్ పంత్ రికార్డు

ABN , First Publish Date - 2023-06-21T18:08:16+05:30 IST

ఆరు నెలలుగా క్రికెట్ ఆడకపోయినప్పటికీ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant ) టెస్ట్ ర్యాంక్‌కు ఢోకా లేకుండాపోయింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాకింగ్స్‌లో (ICC Rankings) పంత్ తన 10వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంకులో ఉన్న టీమిండియా(Team India) బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టాప్ 10లో ఉన్న ఏకైక టీమిండియా బ్యాటర్ కూడా పంతే కావడం గమనార్హం.

ICC Rankings: ఆరు నెలలుగా ఆడకపోయినా చెదరని రిషబ్ పంత్ రికార్డు

ఆరు నెలలుగా క్రికెట్ ఆడకపోయినప్పటికీ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant ) టెస్ట్ ర్యాంక్‌కు ఢోకా లేకుండాపోయింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాకింగ్స్‌లో (ICC Rankings) పంత్ తన 10వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంకులో ఉన్న టీమిండియా(Team India) బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా టాప్ 10లో ఉన్న ఏకైక టీమిండియా బ్యాటర్ కూడా పంతే కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం పంత్ ఖాతాలో 758 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Rishabh Pant (2)1677583333886.jpg

ఇక కొంతకాలంగా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)12వ స్థానంలో ఉండగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో (World Test Championship Final) రాణించలేకపోయిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక స్థానం దిగజారి 14వ ర్యాంకుకు పడిపోయాడు. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌లో దారుణంగా విఫలమైన చటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) 25వ ర్యాంకులో ఉన్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడకపోకపోయినప్పటికీ అతని ర్యాంకుకు ఎలాంటి ఢోకా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 860 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.

rohitsharmaindiatest-one_one.webp

ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ (Ashes Series) ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన మొదటి ర్యాంకును కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంకుకు పడిపోయాడు. యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్ట్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 887 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. రెండో ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఖాతాలో 883 పాయింట్స్, మూడో స్థానంలో ఉన్న లబుషేన్ ఖాతాలో 877 పాయింట్స్ ఉన్నాయి. అయితే టాప్ 3లో ఉన్న ఈ ముగ్గురి బ్యాటర్ల మధ్య 10 పాయింట్లే తేడా ఉండడంతో యాషెస్ సిరీస్ ముగిసే సమయానికి ర్యాంకుల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-06-21T18:10:45+05:30 IST