Share News

Congress : హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ అగ్రనేతలు

ABN , First Publish Date - 2023-12-03T22:32:33+05:30 IST

రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఏఐసీసీ ఢిల్లీ అగ్ర నేతలు రానున్నారు.

Congress : హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ అగ్రనేతలు

హైదరాబాద్‌: రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఏఐసీసీ ఢిల్లీ అగ్ర నేతలు రానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రనేతల భద్రత ఏర్పాట్లపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు ఇంటలిజెన్స్ అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2023-12-03T22:58:13+05:30 IST