Share News

Annamalai: తెలంగాణ ప్రజల పొట్ట కొడుతున్న కేసీఆర్

ABN , First Publish Date - 2023-11-22T22:58:12+05:30 IST

సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజల పొట్ట కొడుతున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు.

Annamalai:  తెలంగాణ ప్రజల పొట్ట కొడుతున్న కేసీఆర్

కుత్బుల్లాపూర్: సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజల పొట్ట కొడుతున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ...‘‘పదేళ్ల తెలంగాణ ప్రజలది కాదు....ఫామ్ హౌస్ తెలంగాణ. నవంబర్30వ తేదీన సామాన్య ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేందుకు పట్టుదలతో ఉన్నారు.బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు తిరగాపడుతున్నారు. నియోజకవర్గంలో మీలాంటి వ్యక్తి, మీలో వ్యక్తి, మీకోసం పని చేసే వ్యక్తి కూన శ్రీశైలం గౌడ్. నేను ప్రచారం చేయడానికి వస్తుంటే ఎంతో మంది నిరుద్యోగ యువకులు వారి బాధను చెప్పుకుంటున్నారు’’ అని అన్నామలై పేర్కొన్నారు.

కేసీఆర్ లక్షల అప్పు పెడుతున్నారు

‘‘గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి 9లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో పథకాలను.. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు దక్కకుండా దుర్వినియోగం చేసింది. పనికి మాలిన ప్రాజెక్టుల పేరుతో మీ మీద లక్షల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ ప్రజల పొట్ట కొట్టింది. కేసీఆర్ ఒక కార్పెంటర్ కూడా కాదు...కానీ ప్రాజెక్టులకు డిజైన్ ఇస్తాడు. కేసీఆర్ మీ భవిష్యత్తునే కాదు.. మీ పిల్లల భవిష్యత్తును కూడా దెబ్బ తీస్తున్నారు. వారి పైన లక్షల అప్పు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకోవాలి. దయచేసి బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ని గెలిపించాలి’’ అని అన్నామలై పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-22T22:58:13+05:30 IST