Share News

BJP Manifesto : ఇవాళ బీజేపీ మేనిఫెస్టో.. వీటిపై స్పెషల్ ఫోకస్!

ABN , First Publish Date - 2023-11-18T08:17:53+05:30 IST

బీజేపీ నేడు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దశ దిశ పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను రూపొందించడం జరిగింది. మేనిఫెస్టో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నా కూడా ఆ పార్టీలకు మించిన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది.

BJP Manifesto : ఇవాళ బీజేపీ మేనిఫెస్టో..  వీటిపై స్పెషల్ ఫోకస్!

హైదరాబాద్ : బీజేపీ నేడు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దశ దిశ పేరుతో బీజేపీ మ్యానిఫెస్టోను రూపొందించడం జరిగింది. మేనిఫెస్టో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే కాస్త ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నా కూడా ఆ పార్టీలకు మించిన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలుస్తోంది.

ఇక మేనిఫెస్టోలో ముఖ్యాంశాలేంటంటే...

ధరణి స్థానంలో మీ భూమి యాప్‌

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు..

గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ..

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు

4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత..

సబ్సిడీపై విత్తనాలు... వరి పంటకు బోనస్..

ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్ళు వచ్చేసరికి 2లక్షల రూపాయలు చెల్లించడం..

ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్‌లు..

మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు..

ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ..

స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు..

ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లు..

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ..

ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు..

పీఆర్సీపై రివ్యూ.. ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ

జీఓ 317 పై పునః సమీక్ష

గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు

5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి

రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం

తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు..

అన్ని పంటలకు పంట భీమా... భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది

5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10లక్షల ఉద్యోగాలు

వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం

Updated Date - 2023-11-18T08:53:57+05:30 IST