Share News

Telangana Elections: సీఈవోను కలిసిన బీఆర్‌ఎస్ లీగల్ టీం.. రేవంత్‌పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-11-13T16:39:17+05:30 IST

Telangana Elections: టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు బీఆర్‌ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. సోమవారం సీఈవోను బీఆర్‌ఎస్ లీగల్ బృందం కలిసింది.

Telangana Elections: సీఈవోను కలిసిన బీఆర్‌ఎస్ లీగల్ టీం.. రేవంత్‌పై ఫిర్యాదు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై(TPCC Chief Revanth Reddy) సీఈఓ వికాస్ రాజ్‌కు (CEO Vikas Raj) బీఆర్‌ఎస్ లీగల్ టీం (BRS legal team) ఫిర్యాదు చేసింది. సోమవారం సీఈవోను బీఆర్‌ఎస్ లీగల్ బృందం కలిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు చేసింది. బీఆర్‌ఎస్‌ను కించపరిచే విధంగా ఉన్న కాంగ్రెస్ యాడ్స్‌ను (Congress Adds) ఆపాలని మరోసారి లీగల్ టీం ఫిర్యాదు చేసింది.


అనంతరం బీఆర్‌ఎస్ లీగల్ బృందం నేత సోమా భరత్ (Soma Bharath) మాట్లాడుతూ.. పచ్చగా ఉన్న తెలంగాణను (Telangana State) హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేట ఘటనలు జరిగాయన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి (Dubbaka MLA Candidater Prabhakar Reddy) ఇప్పటికీ సీరియస్‌గానే ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థలపై దాడులు జరిగితే రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ (BRS) పాలనలో ఎక్కడైనా ఘటనలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రేవంత్‌కు టీడీపీ (TDP) తల్లిపార్టీ అయితే... కాంగ్రెస్ (Congress) అత్తపార్టీ అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీ అంతర్గత ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్యాంపెనియర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి భాష పద్ధతిగా ఉండాలని హితవుపలికారు. ఎంసీసీ కమిటీకి చూపించిన యాడ్స్‌ ఒకటి.. బయట ప్రచారం మరొకటి చేస్తున్నారన్నారు. ఎదైనా కన్ఫ్యూజన్ ఉన్న అంశాలపై ఈసీ స్పష్టత ఇస్తే బాగుంటుందని సోమా భవత్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-11-13T16:42:41+05:30 IST