Congress - BRS: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.. కార్యకర్తలకు గాయాలు
ABN , First Publish Date - 2023-11-23T22:29:34+05:30 IST
జిల్లాలోని వటపల్లి మండలం బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ( Kranti Kiran ) స్వగ్రామం పోతుల బొగుడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోతుల బొగుడ గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ ( Congress ) అభ్యర్థి దామోదర రాజనరసింహ ( Damodara Rajanarasimha ) వెళ్లారు.
సంగారెడ్డి జిల్లా: జిల్లాలోని వటపల్లి మండలం బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ( Kranti Kiran ) స్వగ్రామం పోతుల బొగుడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోతుల బొగుడ గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ ( Congress ) అభ్యర్థి దామోదర రాజనరసింహ ( Damodara Rajanarasimha ) వెళ్లారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ డౌన్ డౌన్ , గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దామోదర్ రాజనరసింహను, కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు యత్నించారు. కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఇరు పార్టీల శ్రేణుల హోరాహోరీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో
నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి సమీపంలోని ఎర్రగట్టు బొల్లారం దగ్గర కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాల్లోని నేతలు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీస్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఇరువర్గాల కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
బాన్సువాడ నియోజకవర్గంలో...
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని ఇబ్రహీంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రచారాన్నిబీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, మీరు మా గ్రామంలోకి రావద్దని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేశారు.