Share News

TS Election: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒక్కసారిగా ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-11-26T19:59:57+05:30 IST

జిల్లాలోని మోతే మండలం బళ్లుతండాలో కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ( Uttam Padmavati ) ప్రచారం చేస్తోంది. ఆకస్మాత్తుగా బీఆర్ఎస్ ( BRS ) పార్టీ నాయకులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు.

TS Election: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒక్కసారిగా ఉద్రిక్తత

సూర్యాపేట : జిల్లాలోని మోతే మండలం బళ్లుతండాలో కాంగ్రెస్ ( Congress ) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ( Uttam Padmavati ) ప్రచారం చేస్తోంది. ఆకస్మాత్తుగా బీఆర్ఎస్ ( BRS ) పార్టీ నాయకులు ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌‌నేతలను వారించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చదరగొట్టారు. అయితే పోలీసుల లాఠీ చార్జీలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డికి గాయాలు అయ్యాయి. సంతోష్‌రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా కేవలం కాంగ్రెస్ నేతలు లక్ష్యంగానే పోలీసులు దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తమ్ పద్మావతి పోలీసుల చర్యను ఖండించి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-26T19:59:59+05:30 IST