Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కొట్టుకుంటారు.. తెలంగాణలో మాత్రం ఎన్నికలయితే కలుస్తారు
ABN , First Publish Date - 2023-11-14T21:56:40+05:30 IST
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఢిల్లీలో కొట్టుకుంటారు.. తెలంగాణలో మాత్రం ఎన్నికలయితే కలుస్తారని మంత్రి హరీష్రావు ( Harish Rao ) సెటైర్లు వేశారు.
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఢిల్లీలో కొట్టుకుంటారు.. తెలంగాణలో మాత్రం ఎన్నికలయితే కలుస్తారని మంత్రి హరీష్రావు ( Harish Rao ) సెటైర్లు వేశారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ మధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోయి బీజేపీ పార్టీ గెలిచింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు పోయి, బీజేపీ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ రెండు పార్టీలు ఒక్కటే. నిన్న మొన్నటి దాకా బీజేపీ పార్టీలో ఉన్న వివేక్, రాజగోపాల్రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనల్ని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న చోట బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ పార్టీ గట్టిగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది.ఏడు మండలాలను కాంగ్రెస్ పార్టీ ఏపీలో కలిపింది బీజేపీ పార్టీ అందుకు సపోర్ట్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ రెండు ఒక్కటే’’ అని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.