Konda Visveshwara Reddy: కేసీఆర్ తెలంగాణను అప్పుల మయంగా చేశారు
ABN , First Publish Date - 2023-11-23T22:42:25+05:30 IST
సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా: సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గుమ్మరించి అప్పుల తెలంగాణగా చేశారని బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ( Konda Visveshwara Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు పరిగిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పరిగి ఎన్నికల ప్రచారంపై కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ పరిగి ఏం మొహం పెట్టుకొని వచ్చాడు. ఐదేళ్ల క్రితం చెప్పిన అబద్దాలే మళ్లీ నిన్నటి పరిగి సభలో చెప్పాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇస్తానని ఈ ప్రాంత రైతులను కేసీఆర్ మోసం చేశాడు’’ అని కొండా విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.
వైద్య, విద్యా రంగాలల్లో తెలంగాణ వెనుకబడింది
‘‘ఈ ప్రాంతానికి పదేళ్లలో ఒక్క ఎకరానికైనా నీరిచ్చినట్టు నిరూపించాలి.పరిగి ప్రాంతంలో బడులు, రోడ్లు, ఆస్పత్రులు అన్ని అధ్వాన్నంగా ఉన్నాయి. 2016లో అప్రూవ్ అయి 2017లో సాంక్షన్ అయిన బీజాపూర్ హైవే నేనే వేయించాను. కేసీఆర్ హయాంలో వైద్య, విద్యా రంగాలల్లో వెనకబడ్డ రాష్ట్రాన్ని దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని మంత్రి కేటీఆర్ అంటున్నాడు.. ఎలా సాధ్యమో చెప్పాలి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం’’ అని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.