Mallikarjuna Kharge: కేసీఆర్, మోదీ, ఓవైసీ ముగ్గురు తోడు దొంగలే
ABN , First Publish Date - 2023-11-22T16:51:11+05:30 IST
సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) వ్యాఖ్యానించారు.
ఆలంపూర్: సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఆలంపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ...‘‘ తెలంగాణ ప్రజలు ఇచ్చే విజయ కానుకను భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తుంది. ఆలంపూర్ చాలా పవిత్రమైన ప్రాంతం.. కృష్ణ మరియు తుంగభద్రాల సంగమ ప్రాంతం. దేశంలో ఉన్న మూడు పత్రికల సుమారు 780 కోట్ల ఆస్తులను బీజేపీ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ మూడు పత్రికలు నెహ్రూ సొంత ఆస్తి. నెహ్రూ స్థాపించిన ఈ మూడు పత్రికలు స్వతంత్ర పోరాటానికి ముఖ్య భూమికను పోషించాయి’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు.
పేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయి
‘‘నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయి. ఇందిరాగాంధీ నీ విమర్శిస్తున్నావు ఇందిరాగాంధీ ఎక్కడ.. మరి కేసీఆర్ ఎక్కడ.. ఫామ్ హౌస్‌లో కూర్చొని పరిపాలిస్తున్నావు. 2017లో ఇచ్చిన నీ హామీలు ఏమయ్యాయి.. ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. తెలంగాణ కోసం అప్పట్లో ఎంపీగా ఉన్న విజయశాంతి ఢిల్లీలో పార్లమెంట్‌లో సభ జరిగినప్పుడు తెలంగాణ కోసం స్పీకర్ పోడియంలోకి వెళ్లి 4, 5 గంటలు పోట్లాడింది.. ఆ సమయంలో నువ్వు ఎక్కడున్నావ్ కేసీఆర్.. కేసీఆర్,కొడుకు, కూతురు, అల్లుడు తెలంగాణను దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం’’ అని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి