Mayawati: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ
ABN , First Publish Date - 2023-11-23T17:31:59+05:30 IST
బీఆర్ఎస్ ( BRS ) దళిత వ్యతిరేక పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ ఛీఫ్ మాయావతి ( Mayawati ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా: బీఆర్ఎస్ ( BRS ) దళిత వ్యతిరేక పార్టీ అని బహుజన్ సమాజ్ పార్టీ ఛీఫ్ మాయావతి ( Mayawati ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar ) ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాయవతి మీడియాతో మాట్లాడుతూ...‘‘అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే. RS ప్రవీణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లను బీఆర్ఎస్ పార్టీ నమోదు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశాము.తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి పంపిణీ చేస్తాం. అన్నివర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలి.30వ తేదీన జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలి’’ అని మాయావతి పిలుపునిచ్చారు.