Ponguleti: బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు
ABN , First Publish Date - 2023-11-15T16:59:09+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు...అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు.
ఖమ్మం జిల్లా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు...అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు. బుధవారం నాడు పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ..‘‘ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తుంది మీము కాదు.. బీఆర్ఎస్ పార్టీనే. ఎవరు డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. 72 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.