Share News

Raghunandan Rao: కేటీఆర్ దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు

ABN , First Publish Date - 2023-11-22T23:11:28+05:30 IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Raghunandan Rao: కేటీఆర్ దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడు

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచాడని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు రాయపోలు మండల కేంద్రంలో రఘునందన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్, రఘునందన్ రోడ్ షో‌లో పాల్గొన్నారు. రఘునందన్ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రఘనందన్ మాట్లాడుతూ...‘‘కేటీఆర్ ఉర కుక్కలాగా మాట్లాడుతున్నాడు.. కేటీఆర్ దుబ్బాకలో నిన్న అవాకులు చెవాకులు పేలాడు. పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కేటీఆర్ రాయపోల్‌కు ఎందుకు రాలేదో చెప్పాలి. మళ్లీ దుబ్బాకకు రా.. నేను ఒక్కడినే వస్తా. నిన్ను సిరిసిల్లాకు తరిమి కొడుతా..బిడ్డ. నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటే కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ని రూపాయకి కూడా కొనరు’’ అని రఘునందన్‌రావు ఎద్దేవ చేశారు.


దుబ్బాకకు కేటీఆర్ రూపాయి పని చేయలేదు

‘‘ప్రజలు ఓటేస్తే గెలిచినా నా మీద కేటీఆర్ మాట్లాడుతున్నాడు. దుబ్బాకకు రూపాయి పని చేయని కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నాడు. కేటీఆర్ నిన్న అన్న మాటలు నన్ను అన్నట్లుగా లేదు దుబ్బాక ప్రజలను అన్నట్లుగా ఉంది. మల్లన్నసాగర్‌లో దోచుకున్న పైసలతో దుబ్బాకలో రఘనందన్‌ను ఓడించడానికి కుయుక్తులు పన్నుతున్నారు. బీఆర్ఎస్ నేతలు డబ్బుల సంచులు పట్టుకొని ఇంటికి రూ. 10 వేలు ఇస్తాడట తీసుకొని బీజేపీకి ఓటు వేయండి. గజ్వేల్‌లో ఇప్పటికే రూ. 100 కోట్లు పంచడానికి సిద్ధంగా పెట్టారట. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే పైసలు తీసుకొని బీజేపీకి ఓటు వేయండి. మూడు రోజుల కిందట మంత్రి హరీశ్‌రావు రాయపోల్‌కు వచ్చి రఘనందన్‌కు నన్ను తిట్టాడం తప్పు ఏది రాదు అన్నాడు.. నిన్ను తిట్టినా ఊరు మీద కుక్కను తిట్టినా ఒక్కటే హరీష్. రాయపోల్‌లో ఒక్క పోలీస్ స్టేషన్ మంత్రిగా ఉండి కట్టడం చేతకాలేదు. పదేళ్ల నుంచి దుబ్బాక అభివృద్ధిని గాలికొదిలేశారు. రాయపోల్ నుంచి అనాజీపూర్ రోడ్డు వేయడానికి పదేళ్లుగా ఎంపీగా ఉండి ఆ రోడ్డు వేయడం చేతకాలేదు.. కేసీఆర్‌కు కొత్తగా కూపన్ కార్డు ఇవ్వడం కూడా చేతకాలేదు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఇక్కడ గెలిస్తే పబ్‌లు వస్తాయి.. నేనే గెలిస్తే వంద పడకల ఆస్పత్రి వస్తాది. నేను పోలీస్ స్టేషన్ కడుతా, అభివృద్ధి చేస్తా. పబ్ కావాలనే నాయకుడు కావాలో.. అభివృద్ధి చేసే నేనే కావాలో నిర్ణయం తీసుకోండి’’ అని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T23:11:33+05:30 IST