Share News

Revanth Reddy: ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు

ABN , First Publish Date - 2023-10-29T17:15:39+05:30 IST

ఇంటికో ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, పావలావడ్డీకే రుణాలు, సాగునీరు, ఉద్యోగాలు ఇలా ఏ హామీని సీఎం కేసీఆర్ (CM KCR) నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.

Revanth Reddy:  ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు

సంగారెడ్డి: ఇంటికో ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, పావలావడ్డీకే రుణాలు, సాగునీరు, ఉద్యోగాలు ఇలా ఏ హామీని సీఎం కేసీఆర్ (CM KCR) నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర సంగారెడ్డిలోని గంజ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రేవంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతులు చనిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. అందుకే సోనియాగాంధీ మరోసారి పూనుకొని తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలను చూపిస్తాం. కర్నాటకలో చర్చకు రమ్మని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సవాల్ విసిరితే... మంత్రి కేటీఆర్ తోక ముడిచారు’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-10-29T17:15:39+05:30 IST