Revanth Reddy: సుధీర్‌రెడ్డి అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండు
ABN , First Publish Date - 2023-11-23T22:36:01+05:30 IST
ఎల్బీనగర్లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నట్టేట ముంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ఎల్బీనగర్లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నట్టేట ముంచాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు ఎల్బీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘అభివృద్ధి ముసుగులో సుధీర్‌రెడ్డి అమ్ముడు పోయిండు. మూసికి చైర్మన్ అయిన సుధీర్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో మూసీలో తొక్కాలి. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. మధుయాష్కీ నాకు సోదరుడితో సమానం. ఆయనను ఎల్బీనగర్లో 30వేల మెజారిటీతో గెలిపించాలి. మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించినట్లే మధు అన్నను గెలిపించండి. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధు అన్న ప్రత్యేక పాత్ర పోషిస్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.