Share News

Telangana Elections: కామారెడ్డిలో మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల రోడ్‌ షోలు.. భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2023-11-28T10:33:08+05:30 IST

Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రానికి ముగియనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం బంద్ కానుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపనున్నారు.

Telangana Elections: కామారెడ్డిలో మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల రోడ్‌ షోలు.. భారీ బందోబస్తు

కామారెడ్డి జిల్లా: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రానికి ముగియనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం బంద్ కానుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపనున్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలో పాల్గొననున్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు (BRS Candidate KTR) జిల్లా కేంద్రంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. అటు దోమకొండ, బీబీపేట, జిల్లా కేంద్రంలో నిర్వహించే రోడ్ షోలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) పాల్గొంటారు. అలాగే జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే రోడ్ షోలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి (BJP candidate Katipalli Venkataramana Reddy) పాల్గొననున్నారు. మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల రోడ్ షోల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-28T10:33:10+05:30 IST