Thummala: కాంగ్రెస్ పాలన వస్తేనే గిరిజనులు, దళితుల జీవితాల్లో వెలుగులు
ABN , First Publish Date - 2023-11-18T20:46:29+05:30 IST
కాంగ్రెస్ పాలనలోనే గిరిజనులు, దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao )అన్నారు.
ఖమ్మం: కాంగ్రెస్ పాలనలోనే గిరిజనులు, దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao )అన్నారు. శనివారం నాడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి, రాంకీ తండాలో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈర్లపూడి రైతులకు సాగు నీటి కష్టాలు దూరం చేయాలని బుగ్గ వాగు చెక్ డ్యాం నిర్మాణం చేశా. బుగ్గ వాగు నుంచి కాలువల కోసం 30 కోట్లు మంజూరు చేస్తే కమీషన్ల కోసం పనులు ఆపారు. గోదావరి జలాలతో మీ పొలాలు సస్య శ్యామలం చేస్తా.
కాంగ్రెస్ పాలనలోనే పోడు భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే గిరిజనుల జీవితాల్లో వెలుగులు వస్తాయి. సాటి మహిళల కష్టాలు తెలిసిన మహిళగా సోనియమ్మ ఆరు గ్యారంటీ పథకాలకు రూపకల్పన చేశారు. మహాలక్ష్మీ పథకంతో గిరిజన మహిళలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని సోనియా గాంధీ ఆకాంక్ష. రైతులకు రైతు భరోసా యువతకు యువ వికాసం పథకాలు మీ కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. సీతారామ ప్రాజెక్ట్‌తో గోదావరి జలాలు బుగ్గవాగు చెక్ డ్యాం నింపి సాగు నీరు మీ పొలాల్లో పారిస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరాచక అవినీతి పాలన చూశారు. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.