Vicar Rasul Wani : కేసీఆర్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు
ABN , First Publish Date - 2023-11-26T21:49:01+05:30 IST
సీఎం కేసీఆర్ ( CM KCR ) పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు వికార్ రసూల్ వార్ని ( Vicar Rasul Wani ) వ్యాఖ్యానించారు.
నల్గొండ జిల్లా : సీఎం కేసీఆర్ ( CM KCR ) పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు వికార్ రసూల్ వార్ని ( Vicar Rasul Wani ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేం ఇచ్చిన 6 గ్యారెంటీ స్కీములు అమలు చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ హమీలు అమలవ్వలేదని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యాలు ప్రచారం నమ్మకండి. పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు. సీఎం కేసీఆర్‌ని కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి పదేళ్లలో చేయని పథకాలు ఇప్పుడు అమలు చేస్తాననడం విడ్డూరంగా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడు ఒకటే. పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందిస్తాం. మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి బీఎల్ఆర్ పేరు జమ్మూ కాశ్మీర్ వరకు వినిపిస్తుంది. బీఎల్ఆర్ భారీ మెజార్టీతో గెలుస్తారు’’ అని వికార్ రసూల్ వార్ని పిలుపునిచ్చారు.
బీఎల్ఆర్ మాతృమూర్తి మృతి
కాగా.. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎల్ఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బీఎల్ఆర్ మాతృమూర్తి వెంకట్రావమ్మ(80)మృతిచెందారు. తల్లి మరణవార్తతో ప్రచారం మధ్యలోనే బీఎల్ఆర్ వెళ్లిపోయారు. ఈ వార్త తెలియడంతో వికార్ రసూల్ వార్ని బీఎల్ఆర్‌ని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి