Share News

YS Sharmila: ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపారు

ABN , First Publish Date - 2023-11-22T17:22:58+05:30 IST

ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) వ్యాఖ్యానించారు.

YS Sharmila: ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపారు

హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు షర్మిల లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ...‘‘ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతోంది. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్‌కు మోదీ సాయం చేస్తున్నారు. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయి’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి

‘‘సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, మద్దతుదారులను మీరు ఇబ్బందులపాలు చేయడమే లక్ష్యంగా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌పై ఎలాంటి విచారణ ఉండదు. లిక్కర్ స్కాంలో వేలకోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరు. భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు జరగవు. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు..మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు’’ అని షర్మిల ఎద్దేవ చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T17:30:28+05:30 IST