Hyderabad: భారీగా డ్రగ్స్ పట్టివేత... స్మగ్లర్ల వెనక ఉన్న ఆ కీలక వ్యక్తి ఎవరు?..

ABN , First Publish Date - 2023-02-14T10:25:31+05:30 IST

భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది.

Hyderabad: భారీగా డ్రగ్స్ పట్టివేత... స్మగ్లర్ల వెనక ఉన్న ఆ కీలక వ్యక్తి ఎవరు?..

హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ (Heavy Drugs) పట్టుబడింది. ముంబై (Mumbai)కి చెందిన నలుగురు డ్రగ్స్ స్మగ్లర్ల (Drug smugglers)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 204 గ్రాములు ఎమ్‌డీఎమ్‌ఏ, 110 కేజీల గంజాయిని సీజ్ చేశారు. గత కొద్దిరోజులుగా డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టిన పోలీసులు ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Hyderabad East Zone Task Force Police), ముంబై పోలీసుల (Mumbai Police)తో కలిసి డ్రగ్స్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలో డ్రగ్స్‌ను ముంబై నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు తీసుకువస్తుండగా స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. గంజా కేసులో ముగ్గురు, డ్రగ్స్ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.60 లక్షలు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల వెనక ఓ కీలక వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

కాగా.. హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర బడా బాబులు డ్రగ్స్‌ను వాడుతున్నారు. పోలీసుల వద్ద మొత్తం సమాచారం ఉన్నప్పటికీ.. ఖాకీల కళ్లుగప్పి డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అవుతోంది?.. ఇందుకు సహకరిస్తున్న వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరికాసేపట్లో ఈ డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న కీలక వ్యక్తి గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

Updated Date - 2023-02-14T10:25:37+05:30 IST