Bandi Sanjay: జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్

ABN , First Publish Date - 2023-06-16T15:01:07+05:30 IST

నగరంలోని పేట్ బషీరాబాద్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం 17 సంత్సరల క్రితం ఒక్కొక్క జర్నలిస్ట్ రూ.2 లక్షల డబ్బులు కట్టారని.. మొత్తం 12.50 కోట్ల డబ్బులు కట్టారని తెలిపారు. జర్నలిస్టుల స్థలం జర్నలిస్టులకు ఇవ్వాలని తీర్పు కూడా వచ్చిందన్నారు.

Bandi Sanjay: జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్

హైదరాబాద్: నగరంలోని పేట్ బషీరాబాద్‌లో జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం 17 సంత్సరల క్రితం ఒక్కొక్క జర్నలిస్ట్ రూ.2 లక్షల డబ్బులు కట్టారని.. మొత్తం 12.50 కోట్ల డబ్బులు కట్టారని తెలిపారు. జర్నలిస్టుల స్థలం జర్నలిస్టులకు ఇవ్వాలని తీర్పు కూడా వచ్చిందన్నారు. అయితే కేసీఆర్ (CM KCR) కుటుంబ సభ్యుల కన్ను ఈ భూమి మీద పడిందని... అందుకే పేట్ బషీరాబాద్ స్థలం ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. ‘‘జర్నలిస్ట్‌ల వల్లే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కేసీఆర్.. నీ కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తున్నారు’’ అని అన్నారు. స్థలం కోసం చూసి చూసి 60మంది జర్నలిస్ట్ లు చనిపోయారని అన్నారు .జర్నలిస్ట్ నాయకులు కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతున్నారని ఆరోపించారు. జర్నలిస్టుల సంక్షేమం గాలికి వదిలేశారన్నారు. జర్నలిస్టులకు స్థలం ఇస్తావా లేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. లీగల్ సహకారం చేస్తామని తెలిపారు. కేసీఆర్ సర్కార్ ఉండేది 5 నెలలే అని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మీ భూమి మీకు ఇస్తామని జర్నలిస్టులకు తెలిపారు. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-06-16T15:01:07+05:30 IST