BJP: చంద్రమండలంపై ఎలా దందా చేయాలా అనేదే కేసీఆర్ కుటుంబ ఆలోచన.. బండి ఎద్దేవా
ABN , First Publish Date - 2023-08-26T12:23:22+05:30 IST
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సిరిసిల్ల: సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్లో పాలన లాగా బీఆర్ఎస్ పార్టీ (BRS) వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ సగం మందికి టికెట్స్ రావన్నారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ (CM KCR) కుటుంబ సభ్యులే కోటీశ్వరులు అయ్యారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం చంద్రమండలంపై ఎలాంటి దందా చేయవచ్చు అని ఆలోచన చేస్తోందని యెద్దేవా చేశారు. కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్కు భయపడే సీఎం కేసీఆర్ సయోధ్యకి వచ్చారన్నారు. బిల్లుల ఆమోదం కోసమే గవర్నర్తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.