TS Politics: రేవంత్ వ్యాఖ్యల దుమారం.. జైల్లో పెట్టాలన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-02-08T10:20:54+05:30 IST

పాదయాత్రలో ప్రగతిభవన్‌ను పేల్చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి.

TS Politics: రేవంత్ వ్యాఖ్యల దుమారం.. జైల్లో పెట్టాలన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: పాదయాత్రలో ప్రగతిభవన్‌ (PragathiBhavan)ను పేల్చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ (TPCC Chief)తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (BRS MLA Peddi Sudarshan Reddy) అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి (RevanthReddy Padayatra) వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader Batti Vikramarka), జానారెడ్డి (Janareddy) సమర్థిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి (Revanth)పై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి (Congress Party) వ్యాఖ్యలపై డీజీపీ (Telangana DGP)కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ (Mahatma Ganthiji) మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని... అక్కడ ప్రభుత్వ ఆఫీస్‌లపై పేల్చాలని డిమాండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అంటూ పెద్దసుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.

కాగా.. రెండో రోజు ములుగు జిల్లాలో జరిగిన ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ పాదయాత్ర (Hath se Hath Jodo Padayatra)లో ప్రగతిభవన్‌పై రేవంత్ రెడ్డి (Padayatra) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఉపయోగపడని ప్రగతిభవన్‌ను నక్సలైట్లు (Naxalites) పేల్చేయాలని అన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతిభవన్‌ ఉంటే ఏమిటి.. లేకుంటే ఏమిటి..? అని మండిపడ్డారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదని అన్నారు. పాదయాత్రలో భాగంగా రెండో రోజు ములుగు జిల్లాలో 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రేవంత్... ప్రజలు, రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-02-08T10:20:55+05:30 IST