Kavitha: సుప్రీంలో ఎదురుదెబ్బ వార్తలపై కవిత క్లారిటీ
ABN , First Publish Date - 2023-03-17T14:21:05+05:30 IST
సుప్రీంకోర్టులో తనకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: సుప్రీంకోర్టు (Supreme Court)లో తనకు ఎదురుదెబ్బ తగిలిందంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తీవ్రంగా ఖండించారు. తాను తాజాగా సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ వేయలేదన్నారు. తాను ఇంతకుముందు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 24న విచారణ జరుగుతుందని కవిత ట్విట్టర్ (Twitter) వేదికగా తెలియజేశారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో ఈడీ విచారణకు హాజరుకాలేనని ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించారని.. అందుకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలిందంటూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం దీనిపై కవిత స్పష్టతనిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కోర్టులో తాను గతంలోనే పిటిషన్ వేశానని తెలిపారు. ఈనెల 24 ఆ పిటిషన్‌ను విచారిస్తామని చెప్పి సుప్రీం కోర్టు తెలిపిందన్నారు. తాజాగా ఈరోజు తాను ఏ విధమైన పిటిషన్‌ను దాఖలు చేయలేదంటూ కవిత ట్వీట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసు విచారణలో నిన్న(మార్చి 16న) ఈడీ ముందు కవిత హాజరుకావాల్సి ఉంది. అయితే తాను హాజరుకాలేనంటూ ఈడీకి కవిత లేఖ రాశారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే 20వ తేదీన కూడా హాజరుకాకుండా ఉండేందుకు మరోసారి ఈరోజు కవిత కోర్టును ఆశ్రయించారు అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే తాను ఎలాంటి పిటిషన్‌ను దాఖలు చేయలేదంటూ కవిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈనెల 20న ఈడీ విచారణకు కవిత హాజరవుతారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది.