Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. వారిని తరిమికొట్టండి

ABN , First Publish Date - 2023-07-08T13:54:36+05:30 IST

బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే.. వారిని తరిమికొట్టండి

హైదరాబాద్: బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Batti Vikramarka) అన్నారు. శనివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... కేటీఆర్ (Minister KTR) ఢిల్లీకి వెళ్లి డీల్ మాట్లాడుకున్నాకే కిషన్ రెడ్డిని (Kishan Reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. రాహుల్ తమ నేత అని.. ఆయన్ని ఏ హోదాలోవస్తారని ప్రశ్నించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం, అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ (CM KCR) బీజేపీకి మద్దతిచ్చారన్నారు. మోదీ (PM Modi), కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణకి న్యాయం చేయలేకపోయామన్నారు. ప్రజల సంక్షేమం కోసం అడ్డంగా నిలబడ్డ వాళ్ళని అడ్డుతొలగించాలన్నారు. క్యాప్తలిస్ట్ బీజేపీని, ఫ్యూడల్ బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి తరిమివేయాలని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజలకి చెందాల్సింది పాలకులకు చెందుతుందని ప్రజలు గ్రహించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - 2023-07-08T16:23:12+05:30 IST